కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని శాంతి లాడ్జిలో దమంజోడి సెక్టర్–3కి చెందిన విజయ్ కుమార్ డకువా (70), అతని భార్య విజయ లక్ష్మి డకువా (65)లు ఉరి వేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డారు. మొదటి లాడ్జికి వచ్చి రూమ్ తీసుకొని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాలకు వెళ్లి వచ్చారు. అనంతరం గదిలో ఉరి వేసుకున్నారు. కొంతసేపటికి గమనించి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వైద్య కళాశాలకి తరలించారు. మృతుల బ్యాగులు, సెల్‌ఫోన్లు ద్వారా పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు.


