విదేశీయుల బసపై సమాచారం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

విదేశీయుల బసపై సమాచారం ఇవ్వాలి

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

● ఝార్సుగుడ పోలీసుల ఆదేశాలు

● ఝార్సుగుడ పోలీసుల ఆదేశాలు

రాయగడ: ఝార్సుగుడ జిల్లాలోని హోటళ్లు, లాడ్జీలు, ఇళ్లు, హాస్టల్స్‌ తదితర వసతి కేంద్రాల్లో విదేశీయులు బస చేస్తే వారి రాక, వెళ్లిన వివరాలను 24 గంటల్లోగా డిజిటల్‌ విధానంలో నమోదు చేయాలని ఝార్సుగుడ ఎస్పీ జీఆర్‌ రాఘవేంద్ర సూచించారు. ఫారినర్స్‌ రీజనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ యాక్ట్‌–2025లోని సెక్సన్‌–8 ప్రకారం ఈ నిబంధనలు అమలులో ఉన్నాయని ఆయన తెలిపారు. సంబంధిత వసతి నిర్వాహకులు నిర్దేశిత ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ఫారం–3 సమర్పించాల్సిన ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని వసతి గృహాల నిర్వాహకులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు కేవలం హోటళ్లు, లాడ్డీలకే పరిమితం కాదని, విదేశీయులకు వసతి కల్పించే ప్రైవేట్‌ ఇళ్ల యజమానులు, ల్యాండ్‌ లార్డులు, విద్యాసంస్థలు, మత సంస్థలు, వైద్య సంస్థలు తదితర అన్నింటికీ వర్తిస్తాయని పేర్కొన్నారు. అలాగే ఓసీఐ కార్డు కలిగిన వారు, నేపాల్‌, భూటన్‌ దేశాల పౌరులు కూడా ఈ రిపోర్టింగ్‌ నిబంధనల పరిధిలోకి వస్తారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ యాక్ట్‌ –2025 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజా భద్రత, జాతీయ భద్రత దృష్ట్యా అన్నివర్గాల వారు పోలీసులకు సహకరించి, నిర్ణీత గడువులో వివరాలను నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement