కొట్లాటపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

కొట్లాటపై కేసు నమోదు

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

కంచిలి: ఎస్‌.ఆర్‌.సి.పురంలో సోమవారం రాత్రి కొట్లాట జరిగింది. గ్రామానికి చెందిన పాలిన కోదండరావు, సోదరుడు ధనుంజయ్‌పై అదే గ్రామానికి చెందిన డొక్కర బలరాం తదితరులు దాడిచేసి గాయపరిచినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉపాధి వేతనదారుడు మృతి

టెక్కలి రూరల్‌: సంతబొమ్మాళికి చెందిన జి.బికారి(55) గ్రామ సమీపంలోని కొండ వద్ద ఉపాధి పనులు చేస్తుండగా మస్టర్‌ వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన ఏపీఓ మూర్తి తోటి వేతనదారులు సహాయంతో హుటాహుటిన కోటబొమ్మాళి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

మహిళపై దాడి

టెక్కలి రూరల్‌: కొండభీంపురం గ్రామంలో ఓ మహిళపై పొరిగింటి వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు..తోనంగి విజయలక్ష్మి తన ఇంట్లో భోజనం చేశాక మిగిలిన వ్యర్థ పదార్థాలను ఇంటి వెనకభాగం పారబోసింది. ఈ విషయమై ప్రశ్నిస్తూ పాత ఆస్తి గొడవల కక్షతో పక్కింటి వారు మహిళ తలపై కత్తితో దాడిచేశారు. ఈ ఘటనలో ఆమె భర్త పోలయ్యకు సైతం గాయాలయ్యాయి. బాధితులను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు.

కూలీ రేట్లు పెంచాలని వినతి

ఎచ్చెర్ల : పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ఎచ్చెర్ల డిపోలో పనిచేస్తున్న హమాలీలకు ప్రస్తుతం ఉన్న ఎగుమతి కూలీ రేటు పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, ఏపీ బేవరేజ్‌ కార్పొరేషన్‌ ఎచ్చెర్ల హమాలీల యూనియన్‌ నాయకులు డి.బంగార్రాజు, టి.రామారావు డిమాండ్‌చేశారు. ఈ మేరకు ఎచ్చెర్ల డిపో మేనేజర్‌ కె.జయసింహా చౌదరికి మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేవరేజ్‌ డిపోల్లో పనిచేస్తున్న హమాలీలు ఎగుమతి పనులు నిర్వహిస్తూ లైసెన్స్‌దారులకు సేవలు అందిస్తున్నారని చెప్పా రు. ఎగుమతి కూలీ రెండేళ్లకోసారి పెంచాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎన్‌.శ్రీను, ఎన్‌.రమణ, ఎల్‌.రాము, సీతారాం పాల్గొన్నారు.

ఐతం స్టార్టప్‌కు డీపీఐఐటీ గుర్తింపు

టెక్కలి: సేంద్రియ వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తూ రైతులకు ఉపయోగకరంగా ఉండేలా టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు పాత్రుని వేణుగోపాలరావు, కొల్లి సందీప్‌కుమార్‌లు రూపకల్పన చేసిన బయోసిప్లెన్‌ స్టార్టప్‌కు కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నుంచి గుర్తింపు లభించింది. ఈ మేరకు మంగళవారం కళాశాల డైరెక్టర్‌ వి.వి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గుర్తింపు పత్రంతో విద్యార్థులను అభినందించారు. నేల సారాన్ని కాపాడుకోవడం, పెట్టుబడి వ్యయం తగ్గించడంలో సాంకేతిక పరిష్కార మార్గాన్ని చూపుతూ ఈ స్టార్టప్‌ను రూపొందించారు. కార్యక్రమంలో ఐతం రైజ్‌ సీఈఓ బి.మనోజ్‌కుమార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ.ఎస్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement