ఘనంగా ప్రపంచ గుండె దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ప్రపంచ గుండె దినోత్సవం

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

భువనేశ్వర్‌: హైటెక్‌ వైద్య బోధన ఆస్పత్రి ప్రాంగణంలో ప్రపంచ గుండె దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుండె చప్పుడు లయ తప్ప కూడదని ప్రబోధించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చైతన్య ఊరేగింపులో హైటెక్‌ గ్రూపునకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, వైద్యులు, హృద్రోగ నిపుణులు, వివిధ విభాగాల ఉద్యోగులు ప్లకార్డులతో పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. ఈ ఊరేగింపును సినీ నటుడు బాబీ మిశ్రా, సీనియర్‌ సీటీవీఏఎస్‌ శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్‌ శ్వేతాంక్‌ దాస్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య కళాశాల ప్రాంగణంలో హృద్రోగ చికిత్స విభాగంలో ఉచిత గుండె జబ్బుల పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో గతంలో ఓపెన్‌ హార్ట్‌, బైపాస్‌ సర్జరీలు చేయించుకుని ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న 42 మంది రోగుల తాజా ఆరోగ్య స్థితిగతులను సమీక్షించారు. హైటెక్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి ముఖ్య అతిథిగా పాల్గొని నిత్యం వ్యాయామంతో గుండె జబ్బుల బారినపడకుండా దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు బాబీ మిశ్రా గుండె అనారోగ్యానికి మూల కారణం అవుతున్న మనో వేదన, అవాంఛనీయ ఆందోళన నివారణతో గుండెని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో హైటెక్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీతారాం మహాపాత్రో, డీన్‌ ప్రొఫెసర్‌ రాధా మాధవ్‌ త్రిపాఠి, చైర్మన్‌ ప్రొఫెసర్‌ దేబానంద మహాపాత్రో, వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ లీసా షడంగి, డాక్టర్‌ శ్వేతా దాష్‌, డాక్టర్‌ రితేష్‌ ఆచార్య, ప్రొఫెసర్‌ డాక్టర్‌ పీకే డాష్‌, డాక్టర్‌ స్మతి రంజన్‌ సాహు, ప్రొఫెసర్‌ ఏకే సామల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ గోపేశ్వర్‌ ఆచార్య, సీఓఓ జ్యోతిర్మయి పండా, ప్రొఫెసర్‌ డాక్టర్‌ చిత్తరంజన్‌ సహాని తదితరులు ప్రముఖంగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement