వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

రాయగడ: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని డీఎఫ్‌వో అన్నాసాహెబ్‌ అహలే అన్నారు. స్థానిక అటవీ శాఖ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన 72వ వన్యప్రాణి వారోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రోజురోజుకూ అంతరిస్తున్న వన్యప్రాణులను మనం కాపాడుకోలేకపోతే భవిష్యత్‌లో వన్యప్రాణుల జాడ కనుమరుగవుతుందన్నారు. ఈ సందర్భంగా వన్యప్రాణి సంరక్షణలో రాష్ట్రపతి పురస్కారం అందుకున్న ఉపాధ్యాయుడు డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ చిన్న కీటకాలు, పక్షుల నుంచి ఏనుగుల వంటి భారీ జంతువుల వరకు ప్రతీ జీవి పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అందువల్ల వన్యప్రాణుల సంరక్షణ మానవ మనుగడకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. సామాజిక సేవకుడు, వన్యప్రాణి సంరక్షకుడు కృష్ణ కేశవ షడంగి తన అనుభవాలను వివరించారు. వన్యాప్రాణుల సంరక్షణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. అనంతరం చిత్రలేఖనం పోటీల్లో గెలిపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement