న్యూస్‌రీల్
ఆమె నదిని జయించింది
చికిత్స పొందుతున్న కాశీ దొలై
భువనేశ్వర్: ఆ నది పేరు బ్రాహ్మణి. జాజ్‌పూర్ సమీపంలోని ఆ నది వైపు చూస్తేనే స్థానికులు జడుసుకుంటారు. మనిషిని నిలువునా తినేయగలిగే మొసళ్లు అడుగడుగునా ఆ నదిలో సంచరిస్తుంటాయి. ఆ నదిలో ఓ అద్భుతం జరిగింది. ఇటీవల వచ్చిన వరదతో బ్రాహ్మణి నది ఉప్పొంగింది. ఆ వరదలో 76 ఏళ్ల ఓ వృద్ధ మహిళ ప్రమాద వశాత్తు పడిపోయారు. దాదాపు 25 కిలోమీటర్ల దూరం ఆ వరదలోనే కొట్టుకుపోయారు. కానీ ఆమె బతికి బయటపడ్డారు. నిం
డా మొసళ్లు ఉన్న నదిలో దాదాపు 12 గంటల పాటు ఆమె బిక్కుబిక్కుమని పోరాడి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ వృద్ధురాలిని జాజ్‌పూర్ జిల్లా బొరి ఠాణా పరిధి కలఖండ గ్రామంలో ఉంటున్న కాశీ దొలైగా గుర్తించారు. శనివారం రాత్రి నదిలో కొట్టుకుపోయి కేంద్రాపడా జిల్లాలో ఆదివారం ఉదయం బయటపడ్డారు. కేంద్రాపడ జిల్లా పట్టముండై మండలం బలిపట్న గ్రామానికి చెందిన మత్స్యకారులు అభిజిత్ సాహు (27), సుధీర్ మల్లిక్ (42) ఆదివారం ఆమె వరదలో తేలుతున్నట్లు చూసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆమె శారీరికంగా అత్యంత బలహీనంగా, నీరసంగా ఉన్నట్లు గుర్తించి తక్షణమే చేరువలో ఉన్న పట్టముండై సబ్ డివిజినల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అక్కడి వైద్యు లు తెలియజేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నా రు. కుటుంబీకులు నిద్ర పోతున్న సమయంలో శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె నది ఒడ్డున మల విసర్జనకు వెళ్లినట్లు ఆమమె కుమారుడు మణియా దొలై తెలిపాడు. ఆ సమయంలో వరద నీటిలో కొట్టుకుపోయిందన్నారు.
సరిగ్గా ఇలాంటి సంఘటనే గంజాం జిల్లాలో చోటు చేసుకుంది. అసికా ప్రాంతంలోని ఘందర గ్రామానికి చెందిన 65 ఏళ్ల ప్రకాష్ చంద్ర సాహు వరదతో ఉప్పొంగుతున్న ఘోడహడ నదిలో చేపలు పడుతుండగా ఉధ్ధృమైన ప్రవాహంలో కొట్టుకుపోయా డు. ఆ శక్తివంతమైన ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకు చేరుకోలేక కల్లోలంగా ఉన్న వరద నీటి మధ్యలో ఉన్న ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని ప్రాణ రక్షణ కోసం తన వంతు ప్రయత్నం చేశారు. చుట్టూ సుడులు తిరుగుతున్న నీటి మధ్య రాత్రంతా దాదాపు 10 గంటల పాటు నిరంతరంగా వా న, చలికి తట్టుకుని ప్రాణ భయంతో ఊగిసలాడాడు. మర్నాటి ఉదయం సమీపంలోని స్థానికులు చెట్టు కొమ్మకు వేలాడుతున్న ప్రకాషా చంద్ర సాహుని గమనించారు. తక్షణమే సమన్వయంతో గ్రామస్తులు రంగంలోకి దిగి కొమ్మకు పట్టుకుని వేలాడుతున్న వ్యక్తిని అక్కున చేర్చుకుని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. చేరువలో ఉన్న హింజిలికాటు సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. ఒడ్డు కు చేరిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు గమనించి ఉన్నత చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ వైద్య కళాశాల, ఆస్పత్రిలో చేర్పించారు.


