కలిమెల సమితి గ్రీవెన్స్‌లో 107 వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

కలిమెల సమితి గ్రీవెన్స్‌లో 107 వినతుల స్వీకరణ

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్వింద్‌ రాజాశిర్కే అధ్యక్షతన గ్రీవెన్స్‌సెల్‌ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 107 వినతులను ప్రజల నుంచి అధికారులు స్వీకరించారు. వాటిలో 58 వ్యక్తిగత సమస్యలు కాగా.. 49 గ్రామీణ సాముహిక సమస్యలకు చెందిన వినతులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వాటిలో కొన్నింటి అక్కడికక్కడే పరిష్కరించిన అధికారులు మిగిలిన వాటిని ఆయా విభాగాల సిబ్బంది అప్పకించి క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా టెక్‌గూడ, పద్మాపూర్‌, రబగూఢ, కోటమేట్ల గ్రామాలకు చెందిన 113 మందికి అటవీ భూమిహక్కు పట్టాలను అధికారులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్‌ పటేల్‌, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరబు, జిల్లా సబ్‌ కలెక్టర్‌ దూర్యోధన్‌ బోయి, కలిమెల తహసీల్దార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement