జయపురం: జయపురం శాశనసభ నియోజకవర్గ పరిధి బొరిగుమ్మ–రాణిఘడ్ రహదారిలో కొండ చరియలు విరిగి పడి రహదారిపై కొండ చరియలు, మట్టి ఎక్కువగా పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బొరిగుమ్మ నుంచి కొరాపుట్‌కు ప్రధాన మార్గం కావటం వల్ల అనేక వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. రోడ్డు పై బురద, రాళ్లు వర్షపు నీరు ఉండటం వల్ల ప్రజల ఇబ్బందిని అర్థం చేసుకున్న ఆయన ప్రజలతో మాట్లాడారు. వెంటనే ఆయన సంబంధిత అధికారులకు తెలిపి అవసరమైన యంత్రాల ద్వారా రోడ్డుపై పడిన కొండరాళ్లు, మట్టి, తొలగించి రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావాలని ఆదేశించారు. పీడబ్ల్యూడీ అధికారులతో చర్చించి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని సూచించారు,
కొండరాళ్లు మట్టి పడిన రహదారిలో నడవలేకపోతున్న ఎమ్మెల్యే తదితరులు


