వరద బాధితులు | - | Sakshi
Sakshi News home page

వరద బాధితులు

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

పునరావాస శిబిరాల్లోనే..

కొరాపుట్‌:

వరద ప్రభావం తగ్గినప్పటికీ బాధితులు ఇంకా పునరావాస శిబిరాల్లోనే కొనసాగుతున్నారు. గురువారం నబరంగ్‌పూర్‌ జిల్లాలో వరద ప్రభావ ప్రాంతాల నుండి శిబిరాలకు వచ్చిన ప్రజలు ఇంకా ఇళ్లకి వెళ్లలేదు. మరో సారి వరద వస్తుందనే భయంతో ఉన్నారు. బాధితులకు అధికారులు, ప్రజా ప్రతినిధులు నచ్చ జెప్పి ఇళ్లకి పంపిస్తున్నారు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు అనే మంది ప్రజలు స్వయంగా ముందుకు వచ్చారు. వారికి ఆహారం, మందులు, నిత్యావసర సామగ్రి పంపిణీ చేస్తున్నారు. నబరంగ్‌పూర్‌ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్‌ రంధారి, నబరంగ్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధానిలు ప్రజల వద్దకు వెళ్లి వారి యోగ క్షేమాలు పరిశీలిస్తున్నారు. నబరంగ్‌పూర్‌ కలెక్టర్‌ మహేశ్వర్‌ స్వయ్‌, ఎస్పీ పార్ధవ్‌ కశ్యప్‌ లు శిబిరాల్లో ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో ఇంకా తాగునీటి సరఫరా మెరుగు పడలేదు. దాంతో ప్రజలు దాహం కేకలు వేస్తున్నారు. ప్రభుత్వం నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు. నబరంగ్‌పూర్‌ పట్టణ సమీపంలో జాతీయ రహదారి వంతెనపై ఆకస్మికంగా పెద్ద గొయ్యి ఏర్పడింది. దాంతో అక్కడ పోలీసులను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నారాయణ పట్న, బందుగాం ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమల యంత్రాలు వరదలో కొట్టుకు పోయి, ప్రస్తుతం వెలుగు లోనికి వస్తున్నాయి. అప్పర్‌ ఇంద్రావతి హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ రిజర్వాయర్‌ ఉన్న ఖాతీగుడ వద్ద నీటి పరిణామాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement