భువనేశ్వర్: దృఢమైన ఫార్మసీ భావి ఆరోగ్య సంరక్షణకు పునాది నినాదంతో స్థానిక హెటెక్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో శుక్రవారం ప్రపంచ ఫార్మసీ దినోత్సవాన్ని నిర్వహించారు. హై టెక్ గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృత్తి రంగంలో ఎదుగుదలకు ఉన్నత వ్య క్తిత్వం వన్నె దిద్దుతుందని ఫార్మసీ విద్యార్థులను ప్రోత్సహించారు. వర్ధమాన తరాల సేవా దృక్పథంతో భావితరాల్లో ఉత్తమ మానవీయ విలువలను ప్రేరేపిస్తుందన్నారు. భారత్ బయోటెక్ ప్రెసిడెంట్ డాక్టర్ రజత్ కుమార్ మహా పాత్రో, క్యాపిటల్ ఆస్పత్రి ఫార్మసీ విభాగం అధిపతి భాను ప్రసాద్ మిశ్రా, ఫార్మసీ కళాశాల వర్కింగ్ చైర్మన్, ట్రస్టీ సావిత్రి పాణిగ్రాహి, హైటెక్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీతారామ్ మహా పాత్రో, సీఓఓ జ్యోతిర్మయి పండా, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అల్కారి మల్కిన్ బెహెరా, ఫార్మసీ కళాశాల చైర్మన్ డాక్టర్ ప్రసన్న కరి, వైస్ చైర్మన్ బబితా సాహు, స్టోర్స్ అండ్ పర్చేజ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ గిరీష్ పాత్రో ప్రసంగించారు.


