జిల్లాలో గిరిజనులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. జిల్లా నుంచి రానుపోను 200 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ పనులు జరగడం లేదు. గిరిజన ప్రాంతాలపై పర్యవేక్షణ కూడా కొరవడుతోంది. మెళియాపుట్టిలో ఏర్పాటు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆర్థిక శాఖ అనుమతులు, ఇతరత్రా సాంకేతిక అంశాలను తెరపైకి తెచ్చి జాప్యం చేస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే ఐటీడీఏను ఏర్పాటు చేయాలి. – సవర వెంకటేష్,
గిరిజన సంఘం నాయకుడు, మెళియపుట్టి
●


