సరుబుజ్జిలి: కొత్తకోట సమీపంలోని పెద్దచెరు వు నుంచి కింగ్‌కోబ్రా జాతికి చెందిన భారీ పాము బయటకురావడంతో జనాలు పరుగు లు తీశారు. సుమారు 12 అడుగుల పొడవైన ఈ పామును కొంతమంది యువకులు రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు.
శ్రీకాకుళం కల్చరల్ : ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, భారతీయ భాషా సంస్థ, మైసూరు సంయుక్తంగా విజయవాడలోని కె.బి.ఎన్ కళాశాలలో నిర్వహించిన జాతీయ సదస్సులో గాయత్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు భమిడిపాటి గౌరీశంకర్‌ను ఘనంగా సత్కరించారు. ‘మనుచరిత్ర– ఖగోళ విజ్ఞాన అంశాలు’అనే అంశంపై ఈయన పత్ర సమర్ప ణ చేశారు. ఈ సందర్భంగా గౌరీశంకర్‌ను గురజాడ సంస్థల అధినేత జి.వి.స్వామి నాయుడు, ప్రిన్సిపాల్ కె.వి.వి.సత్యనారాయణ, మేజర్ మహేష్, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ మార్తాండ కృష్ణ తదితరులు శుక్రవారం అభినందించారు.
పోలాకి: పోలాకి మండల కేంద్రంలోని విశ్వేశ్వరనగర్‌కు చెందిన ఐటీబీ పీ జవాను సిద్దాంతం కిరణ్‌కుమార్(35) అనా రోగ్యంతో మృతి చెందిన ట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అమర్‌నాథ్‌లో విధులు నిర్వహిస్తూ కొన్ని రోజులుగా డెంగీ బారినపడి చికిత్స పొందుతున్న కిరణ్‌కుమార్ ఆస్పత్రిలో గురువారం రాత్రి మృతి చెందినట్లు చెప్పారు. శనివారం ఉదయం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కిరణ్‌కుమార్‌కు భార్య శిరీష, ఇద్దరు కుమారు లు మోక్షిత్‌కుమార్, లోహిత్ ఉన్నారు.
నరసన్నపేట: వర్షం పడిందంటే చాలు స్థానిక వంశధార కాలనీ స్కూల్ విద్యార్థులు సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలోకి మారాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత గది శ్లాబ్ పెచ్చులు ఊడి వర్షానికి కారుతుండటంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. 4 రోజులు వర్షాలు కురవడంతో పాఠశాల భవనం మరింతగా శిథిలావస్థకు చేరింది. విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉంద ని భావించిన ఉపాధ్యాయిని అధికారుల సూచనలతో సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రానికి తాత్కాలికంగా తరలించారు. వర్షం పడిన ప్రతి సారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


