పర్లాకిమిడి: గజపతి జిల్లాలో వరద ప్రమాద ప్రాంతాల్లో పర్యటన కోసం ఆదనపు స్పెషల్ రిలీఫ్ కమిషనరు సిద్ధార్ధ శంకర్ ఆచార్య శుక్రవారం చేరుకున్నారు. సహాయ చర్యలు పర్యవేక్షించడానికి రాయగడ బ్లాక్, మోహానా బ్లాక్‌లో లబార్ సింగి గ్రామాల్లో పర్యటించిన ఆయన వర్షాలకు కూలిపోయిన ఇళ్లను పర్యవేక్షించారు. ఆర్.ఉదయగిరి బ్లాక్‌లో అంగన్‌వాడీ కేంద్రంలో తలదాజుకుంటున్న వరద బాధితులను పరామర్శించారు. అలాగే వివిధ తుఫాన్ షెల్టర్ వుంటున్న బాధితులకు ఆహారం, మంచినీటి సౌకర్యాల కోసం అధికారులను అడిగి తెలుపుకున్నారు. రాయఘడ బ్లాక్ కార్యాలయంలో బీడీవో, తహసీల్దార్, ఓడ్రాఫ్ బృందంతో మాట్లాడి సహాయక చర్యలు గురించి సమీక్షించారు. ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ, జిల్లా అత్యవసర అధికారి బినాయక్ రవుళో, సబ్ కలెక్టర్ భగత్ సామల్ కళ్యాణ్‌రావుతో మాట్లాడారు.


