విద్యార్థుల సమస్యలపై సమరశీల పోరాటాలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమస్యలపై సమరశీల పోరాటాలు

Sep 11 2026 11:09 AM | Updated on Sep 11 2026 11:09 AM

విద్యార్థుల సమస్యలపై సమరశీల పోరాటాలు

శ్రీకాకుళం: విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలే శరణ్యమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ శ్రీకాకుళం జిల్లా ప్లీనరీ సమావేశం సందర్భంగా జిల్లా అధ్యక్షు డు డి.చందు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు తగిన నిధులు కేటాయించకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య,మౌలిక సదుపాయా లు అందడం లేదన్నారు. విద్యారంగాన్ని ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ వైపు తీసుకెళ్లడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం పెరుగుతోందని విమర్శించారు. ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను సకాలంలో భర్తీ చేయాలన్నారు. హాస్టల్‌ సమస్యలు, భవనాల కొరత తీర్చాలన్నారు. ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థులకు స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ హాస్ట ల్‌ ఏర్పాటు చేయాలని, నివగాంలో జూనియర్‌ కా లేజీ భవనాన్ని వెంటనే నిర్మించాలని, టెక్కలి బీసీ హాస్టల్‌ విద్యార్థులకు భవనం కేటాయించాలని ప్లీనరీలో తీర్మానాలు చేశారు. అనంతరం 21 మందితో నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.ఖగేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement