మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి జేఎంఎఫ్‌సీ కోర్టు క్లర్క్ అచ్యుత ప్రధాన్ గురువారం సాయంత్రం రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్‌కు చిక్కారు. ఆయన వద్దకు వచ్చిన క్లయింట్ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి రూ.50 వేలు లంచం అడిగారు. ఇంటికి వచ్చి ఇవ్వాలని చెప్పారు. అచ్యుత ప్రధాన్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. మల్కన్‌గిరి, జయపూర్‌లో గల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
నేడు బ్యాంకుల సమ్మె
పర్లాకిమిడి: జాతీయ బ్యాంకులు గజపతి జిల్లాలో శుక్రవారం ఒక్కరోజు సమ్మెకు పిలుపినిచ్చాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్లు (యు.ఎఫ్.బి.యు) పిలుపుమేరకు శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. వారానికి ఐదు రోజుల పనిదినాలు, పి.ఎల్.ఐ అమలు, 12 బి.పి.ఎస్‌ల అమలు, పెన్షన్ అపడేషన్, ఎన్.పి.ఎస్ నుంచి పాత పింఛన్ అమలు తదితర అంశాలపై బంద్ జరుపుతున్నట్టు గజపతి జిల్లా బ్యాంకుల యునైటెడ్ ఫోరం అధ్యక్షుడు తెలిపారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: అమరావతిలో గురువారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. అందుబాటులో ఉన్న భూములకు సంబంధించి స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్‌ను తయారు చేయాలని, ప్రతి ప్రభుత్వ శాఖ, జిల్లా కలెక్టర్ స్పష్టమైన యాక్షన్ క్యాలెండర్‌ను రూపొందించుకుని నిర్దేశిత గడువులోగా ఫలితాలు సాధించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఎచ్చెర్ల: ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మించడానికి అందరూ కృషి చేయాలని జిల్లా వైద్యా రోగ్యశాఖాధిరి ఐవీవీఎన్ నరేష్‌కుమార్ అన్నా రు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్స వం సందర్భంగా ఎచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దేశంలో ఏటా 1,70,746 మంది ఆత్మహ త్య చేసుకుంటున్నారని, అందులో 18 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్నవారే ఎక్కువని చెప్పా రు. మనకు తెలిసిన వారు ఆర్థిక, శారీరకపరమైన ఇబ్బందుల్లో ఉంటే అండగా నిలవాలన్నా రు. మానసిక సమస్యలతో బాధపడుతుంటే టోల్‌ఫ్రీ నంబర్ 14416కు సంప్రదించాలన్నా రు. కార్యక్రమంలో జిల్లా అధికారి రజనీ, వైద్యాధికారులు ఉషశ్రీ, గంగాప్రియదర్శిని, నాగోజీ, వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పాతపట్నం: ఐటీడీఏ పరిధిలో చేపడుతున్న అన్ని ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాల ని సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ అధికారులను ఆదేశించారు. గురువా రం పాతపట్నం సబ్ డివిజన్ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లా డుతూ గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న రహ దారులు, భవన నిర్మాణాల పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించా రు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. అనంతరం ఇటీవల మరమ్మతులు చేసిన సబ్ డివిజన్ కార్యాలయాన్ని పీవో ప్రారంభించి ఆవరణలో మొక్క నాటా రు. కార్యక్రమంలో ఈఈ రమాదేవి, డీఈఈ నాగభూషణ్, సిమ్మన్న పాల్గొన్నారు.
ఎచ్చెర్ల : బడివానిపేటకు చెందిన వారధి మహందాత (52) అనే మత్స్య కారుడు కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో గురువారం మృతి చెందాడు. తోటి మత్స్యకారులతో కలిసి సముద్రంలో వేటకు వెళ్లగా అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే తిరిగి వస్తుండగా బోట్‌లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


