త్యాగధనుల ఆశయసాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

త్యాగధనుల ఆశయసాధనకు కృషి

Sep 11 2026 11:09 AM | Updated on Sep 11 2026 11:09 AM

త్యాగధనుల ఆశయసాధనకు కృషి

మందస: అమాయక గిరిజనులు, రైతులు, కూలీ లు, పేద ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరా డిన కుమార్‌, సీతారాములు త్యాగాలు స్ఫూర్తిదా యకమని జనశక్తి సంఘ నాయకుడు కోనేరు రమేష్‌ అన్నారు. మందస మండలం కుసుమల పంచాయ తీ బలయాగం గ్రామంలో గురువారం నిర్వహించి న కుమార్‌, సీతారాములు 28వ వర్ధంతి సందర్భంగా సంతాప సభ నిర్వహించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమార్‌ నాయకత్వంలో మెళియాపుట్టి, టెక్కలి, నందిగాం, పలాస, మందస తదితర ప్రాంతాల్లో గిరిజన భూ పోరాటాలు జరిగాయని, నాటి పోరాటాల ఫలితంగా సాధించిన భూముల్లో నేటికీ అనేక మంది గిరిజనులు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని గుర్తు చేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ పేదల హక్కుల కోసం పోరాడట మే వారికి అందించే నిజమైన నివాళి అని తెలిపా రు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సుధాకర్‌, మాధవరావు గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement