జయపురం: కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి డ్రైవర్ల మహాసంఘ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని డ్రైవర్ సంఘ నేతలకు ఆయన గతంలో మాట ఇచ్చారు. ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారా అని నిరీక్షిస్తున్న మహాసంఘ నేతలకు బొయిపరిగుడ సమితి ఎమ్మెల్యే ప్రతినిధి చక్ర బైరాగీ తీపి కబురు చెప్పారు. ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ డ్రైవర్ల మహాసంఘ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆ సమాచారంతో డ్రైవర్ మహాసంఘ అధ్యక్షునితో పాటు సంఘ నేతలు, సభ్యులు మంగళవారం కొరాపుట్‌లో ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ నివాసానికి వెల్లి కలిశారు. సంఘ కార్యాలయ నిర్మాణానికి రూ.6 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన వారికి తెలిపారు. దీంతో సంఘ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.


