పింఛన్‌ చెల్లింపు జాప్యంపై వడ్డీ | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ చెల్లింపు జాప్యంపై వడ్డీ

Sep 9 2026 12:47 AM | Updated on Sep 9 2026 12:47 AM

పింఛన్‌ చెల్లింపు జాప్యంపై వడ్డీ

భువనేశ్వర్‌: పరిపాలనాపరమైన లోపాలు, అధికారిక చర్యల్లో జాప్యం కారణంగా సకాలంలో పింఛను మంజూరు కాని పరిస్థితుల్లో ఫించనుదారులకు వడ్డీ చెల్లిస్తారు. ఫించన్‌ చెల్లించవలసిన తేదీ నుంచి ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఆలస్యమైతే 7 శాతం రేటు చొప్పున వార్షిక వడ్డీ చెల్లించే నిబంధనను మంత్రి వర్గం ఆమోదించిందని ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్‌ తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం ఒక సంవత్సరం దాటిన కాలానికి పింఛను మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఉండగా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల సంబంధిత విచారణలు ప్రారంభించబడి పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగినా లేదా సంబంధిత సంఘటన జరిగిన 4 సంవత్సరాలలోపు ప్రారంభించబడినా పింఛను లేదా గ్రాట్యుటీని నిలిపివేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి ఈ సవరణలు ప్రభుత్వానికి హక్కును కల్పిస్తాయని వివరించారు. ఒడిశా సివిల్‌ సర్వీసెస్‌ (పెన్షన్‌) నిబంధనలు, 1992లోని కీలక నిబంధనలను కేంద్ర సివిల్‌ సర్వీసెస్‌ (పెన్షన్‌) నిబంధనలు, 2021కి అనుగుణంగా ఈ సవరణలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement