ఆపత్కాలంలో ఆపన్న హస్తం | - | Sakshi
Sakshi News home page

ఆపత్కాలంలో ఆపన్న హస్తం

Aug 30 2026 1:33 AM | Updated on Aug 30 2026 1:33 AM

రెండేళ్లుగా గదికే పరిమితమైన మహిళకు కొత్త జీవితం

రాయగడ: భర్త మృతి చెందిన అనంతరం మానసిక ఆరోగ్య సమస్యలతో రెండేళ్లుగా గదికే పరిమితమైన మహిళకు ఎట్టకేలకు కొత్త జీవితం దక్కింది. జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బంది సమన్వయంతో ఆమెకు అవసరమైన మానసిక చికిత్స అందించి, తదుపరి సంరక్షణ, పునరావాసం కోసం మల్కన్‌గిరిలోని పునరావాస కేంద్రానికి తరలించారు. జిల్లాలోని బిసంకటక్‌ సమితి పరిధి జుగాపదర్‌ గ్రామానికి చెందిన ఈ మహిళ మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా చాలాకాలంగా కుటుంబ సభ్యుల నుండి, సమాజం నుండి దూరంగా జీవిస్తున్నట్లు అధికారులకు సమా చారం అందింది. కలెక్టర్‌ అశుతొష్‌ కులకర్ణి ఆదేశాల మేరకు వైద్య బృందం గ్రామానికి వెళ్లి ఆమె పరిస్థితిని పరిశీలించింది. ఈ బృందంలో జిల్లా కేంద్రాస్పత్రి మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ రాకకేష్‌ రంజన్‌ పాఢి, బిసంకటక్‌ సీహెచ్‌సీ ఇన్‌చార్జి అధికారి డాక్టర్‌ హెచ్‌ బి టుడు, మానసిక ఆరోగ్య సామాజిక కార్యకర్త పూర్ణ చంద్ర కాదాంబాలు, స్థానిక సర్పంచ్‌ తదితరులు ఉన్నారు. కుటుంబ సభ్యులకు మానసిక అనారోగ్యం, దాని చికిత్స, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని ఒంటరిగా ఉంచడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై అవగాహన కల్పించారు. అనంతరం మహిళను రాయగడ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. డాక్టర్‌ రాకేష్‌ రంజన్‌ పండ పర్యవేక్షణలో ఐదు రోజుల పాటుగా మానసిక ఆరోగ్య చికిత్స, అవసరమైన సహాయాన్ని అందించారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మార్పు కనిపించడంతో పాటు పరిస్థితి స్థిరపడిందని నిర్ధారించారు. దీంతో ఆమెకు దీర్ఘకాలిక సంరక్షణ, పునరావాసం అవసరమని గుర్తించి తదు పరి ఏర్పాట్లు చేశారు. రాయగడ జిల్లా సామాజిక భద్రత అధికారి ఎలిజబెత్‌ గొర్డా శ్రీకాంత్‌ కుమార్‌ పాణిగ్రహి, సబ్‌ డివిజనల్‌ సొషల్‌ సెక్కూరీటీ ఆఫీసర్‌ జ్ఞానవర్ధిని, కొలనార సమితి మరి కొంతమంది సహకరించారు. సమన్వయంతో ఆమెను మల్కనగిరి లోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రాకేష్‌ మాట్లాడుతూ మానసిక అనారో గ్యం కారణంగా ఎవరినీ బంధించి లేదా సమా జానికి దూరంగా ఉంచకూడదని అన్నారు. సకా లంలో చికిత్స, కుటుంబ సభ్యుల సహకారం, పునరావాసం, సమాజం నుంచి అంగీకారం లభి స్తే మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతు న్న వారు కూడా గౌరవప్రదమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపగలని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement