జానకి మృతికి గవర్నర్‌ సంతాపం | - | Sakshi
Sakshi News home page

జానకి మృతికి గవర్నర్‌ సంతాపం

Jul 13 2026 12:58 AM | Updated on Jul 13 2026 12:58 AM

భువనేశ్వర్‌: శ్రోతల హృదయాల్లో చోటు చేసుకున్న దిగ్గజ గాయని ఎస్‌.జానకి మరణం తీవ్రంగా కలిచి వేసిందని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి అన్నారు. లెజండరీ సింగర్‌ మృతికి సంతాపం తెలియజేశారు. సౌందర్యం, గాంభీర్యం, భావోద్వేగం కలగలిసిన తన కంఠంతో ఆమె సృష్టించిన వారసత్వం తరతరాల మధుర స్మృతులలో చెరగని ముద్ర వేసిందని శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

గాన కోకిల మృతికి సంతాపం

పర్లాకిమిడి: గాన కోకిల సిట్ల జానకి మృతి సినీప్రపంచానికి తీరని లోటని చైతన్య సాహితీ సంస్కృతి సమితి అధ్యక్షులు కోండా రామారావు అన్నారు. జానకి సంతాప సభను కేవుటివీధిలోని ఆయన స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేశారు. పలువురు చైతన్య సమితి సభ్యురాలు రేణుక.. జానకి పాడిన మధురమైన పాటలను ఆలపించారు. తెలుగు, మళయాలం, తమిళం, ఒడియా, హిందీ, కన్నడ తదితర భాషలో 48 వేలకు పైగా పాడిన మధురగాయనీ జానకి మృతి అభిమానులకు తీరని లోటని కార్యదర్శి బర్నాల జనార్దనావు అన్నారు. అల్యాన వినయ్‌కుమార్‌, మురళీ బెహారా, ఎన్‌.రేణుక, గణేష్‌ పట్నాయిక్‌, గంటా నానాజీ, ఎన్‌. సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement