● చెవి దిద్దులు తెంపివేత
రాయగడ: వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి బంగారు చెవి దిద్దులను తెంపుకుపోయారు. ఈ ఘటన జిల్లాలోని కళ్యాణసింగుపూర సమితి మజ్జిగుడ పంచాయతీలోని కొత్తగుడ గ్రామంలో మంగవారం చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితురాలు సతాయి హికక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం మజ్జిగుడ సంతకు వెళ్లిన సీతాయి కూరగాయలు కొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు బైకుపై వచ్చి ఆమెను అడ్డగించి చెవిదిద్దులు తెంపుకుని వెళ్లిపొయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


