రాయగడ: సమస్యలను పరిష్కరించాలని స్థానిక డొండ్ సమాజం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణిని తన కార్యాలంయలో బుధవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గల ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న డొంబ్ తెగకు చెందిన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, డొంబ్ సమాజ్ సంస్కృతికి అద్దం పట్టే వాయిద్యాలను పంపుగ, శుభ కార్యాలయాల్లో వినియోగించే విధంగా ప్రోత్సాహించాలని పేర్కొన్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో డొంబ్ సమాజానికి చెందిన భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని విన్నవించారు. ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ పాఠశాలలో పది శాతం సీట్లను డొంబ్ కులాలకు చెందిన విద్యార్థుల కోసం రిజర్వేషన్లను ఏర్పాటు చేయాలని కొరారు. వినతిపత్రం సమర్పించిన వారిలొ డొంబ్ సమాజం జిల్లా అధ్యక్షుడు ధనీరాం నాయక్, సాధారణ కార్యదర్శి జనార్దన్ గొరడ, త్రినాథ బీభర్, చిత్రసేన్ సునా, బృందావన్ నాయక్, రామ గొరడియా, బిసు ఖొసల పాల్గొన్నారు.


