జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి బదుడి పర్వత సమీపంలోగల నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ కుటుంబంలో నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు మాత్రమే కనుగొన్నారు. మిగతా ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. ఆ సంఘటన జరిగిన నెలన్నర తర్వాత శబరి నదిలో మంగళవారం మధ్యాహ్నం ఒక అస్తి పంజరం కనిపించింది. సమాచారం అందిన వెంటనే కొరాపుట్ వాడ్రాప్ టీమ్ అక్కడకు చేరుకుని బదుడి పర్వత ప్రాంతం శబరి నది ఘాట్‌కు వెళ్లి నదిలో తేలియాడుతున్న అస్తి పంజరాన్ని బయటకు తీశారు. ఈ అస్తిపంజరం నాడు గల్లంతైన వారిలో ఒకరిదిగా అనుమానిస్తున్నారు. గత ఫిబ్రవరి 1వ తేదీన దండాబెడ గ్రామంలో లలిత పూజారి తన భార్యబిడ్డలతో గుప్తేశ్వర్ సమీప బదుడి పర్వత సమాప శబరి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాలేదు. వారి బంధువులు ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు వాడ్రాఫ్ టీమ్‌తో చేరుకుని గాలించారు. ఎట్టకేలకు లలిత పూజారి అతడి చిన్న కుమార్తెల మృతదేహాలు కనుగొన్నారు. భార్య, కుమారుల ఆచూకీ తెలియ లేదు. ఆనాడు గల్లంతైన లలిత పూజారి భార్యదే ఈ అస్తిపంజరం అని అనుమానిస్తున్నారు.


