పర్లాకిమిడి:
స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో గజపతి జిల్లా న్యాయసేవా ప్రాధికరణ అధ్యక్షులు, జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహాంతి ఆదేశాల మేరకు కోర్టు రిజిస్ట్రార్ ప్రసన్న కుమార్ బెహారా ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ, బాల్యవివాహాలపై చైతన్య కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటుచేశారు. హాజరైన జిల్లా న్యాయాలయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా, డీపీసీవో అరుణ్ కుమార్ త్రిపాఠి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధాకర్ పట్నాయక్ మాట్లాడారు. వేసవిలో కాలుష్యం నివారణకు చెట్లను నాటాలని రాజేష్ కుమార్ మిశ్రా అన్నారు. అలాగే బాల్యవివాహాలు వల్ల అనేక మంది ఆడపిల్లలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని జిల్లాశిశుసంరక్షణ అధికారి అరుణ్‌కుమార్ త్రిపాఠి అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంటు పీపీ యడ్ల శివకుమార్, జిల్లా ఆదనపు శిక్షాధికారి ఎస్.గిరిధర్‌రావు, గుసాని బ్లాక్ శిక్షాధికారి సోమేశ్వరరావు, బాయ్స్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మోనాలిసా దాస్ పాల్గొన్నారు.


