గంజాయి తరలిస్తూ కేరళ వాసి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తూ కేరళ వాసి అరెస్టు

Mar 13 2026 7:49 AM | Updated on Mar 13 2026 7:49 AM

గంజాయి తరలిస్తూ కేరళ వాసి అరెస్టు

రణస్థలం: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని లావేరు పోలీసులు గురువారం పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. లావేరు పోలీస్‌ స్టేషన్‌లో జె.ఆర్‌.పురం సీఐ ఎం.అవతారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కేరళ రాష్ట్రం కన్నూర్‌ జిల్లా ఇరుక్కుర్‌ పంచాయతీ పల్లిపాత్‌ హౌస్‌ గ్రామానికి చెందిన అబ్దుల్‌ రవూఫ్‌ సుభద్రాపురం జంక్షన్‌లో అనుమానాస్పదంగా సంచరించడంతో గురువారం పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు గంజాయి బండీలు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం కూర్గ్‌ జిల్లాకు చెందిన మహమ్మద్‌ అలీ సూచన మేరకు ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన రాజు (నాగేన్‌ ప్రధాన్‌) వద్ద నుంచి గంజాయి తీసుకొస్తున్నట్లు అంగీకరించాడు. మహేంద్రగడ నుంచి పర్లాకిమిడి వరకు, అక్కడి నుంచి పలాస వరకు, అక్కడి నుంచి సుభద్రపురం జంక్షన్‌ వరకు వేర్వేరు బస్సులో రవూఫ్‌ వచ్చాడు. విశాఖ వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అవతారం తెలిపారు. విలేకరుల సమావేశంలో లావేరు ఎస్సై కె.అప్పలసూరి, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement