మత్స్య, పశుసంపద మేళా ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మత్స్య, పశుసంపద మేళా ప్రారంభం

Feb 18 2026 7:25 AM | Updated on Feb 18 2026 7:25 AM

మత్స్

మత్స్య, పశుసంపద మేళా ప్రారంభం

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ప్రధాన కేంద్రంలోని ఆదివాసీ మైదానంలో మంగళవారం జిల్లా స్థాయి మత్స్య, పశుసంపద మేళా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ప్రతినిధి సంజయ్‌ సర్కార్‌, ఎమ్మెల్యే ప్రతినిధి నిమాయి పాల్‌, చిత్రకొండ ఎమ్మెల్యే ప్రతినిధి వినాయక పాత్ర, బాలిమేళా నోటిఫైడ్‌ ఏరియా కౌన్సిల్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ నాయక్‌ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ సోమేశ్‌ ఉపాధ్యాయ్‌ అధ్యక్షత వహించారు. జిల్లా ప్రధాన పశువైద్యాధికారి గగన్‌ చరణ్‌ నాయక్‌ స్వాగత ప్రసంగం చేశారు. ఈ మేళాలో మత్స్య, పశుసంపద అభివృద్ధి శాఖకు చెందిన పలు పథకాల అవగాహన కల్పించారు. రైతులు ఈ పథకాల ప్రయోజనాలకు పొందాలన్నారు. రైతులు ఆర్థికంగా స్వావలంబన పొంది.. రాష్ట్రం, దేశ ఆర్ధికాభివృద్ధికి దోహదం చేస్తారని తెలిపారు. పశుసంపదశాఖ ఆధ్వర్యంలో వివిధ జంతువుల ప్రదర్శన స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో షాహీవాల్‌ జాతి ఆవు, గిర్‌జాతి ఆవు, శంకర్‌ జాతి దూడలు, పోనీ గుర్రం, శిరోలీ మేక, టర్కీపక్షి, సోండికోడి, గీత్‌కోడి, ఖాకీ కాంప్‌బెల్‌ బాతు, క్వెయిల్‌ కోడిని ప్రదర్శించారు. మత్స్యశాఖ జీవ ప్రదర్శనలో వివిధ రకాల చేపల పెంపకం సమూనాలను అక్వేరియంల ద్వారా చూపించారు. బయోటెక్‌, ఇతర చేపల పెంపకం నమూనాలను కూడా ప్రదర్శించారు. కేవీకే, ఉద్యానవనం, మిల్లెట్‌ మిషన్‌ వంటి విభాగాల స్టాళ్లలో పలు ఉత్పత్తులను విక్రయించారు. మిల్లెట్‌, రాగితో తయారు చేసిన స్వీట్లు ఒక రైతు స్టాల్‌లో ప్రదర్శించగా ప్రజలను ఆకర్షించాయి. ముఖ్యమంత్రి కామధేను పథకం, పశుసంపద సమృద్ధి పథకం, తదితర స్టాళ్లను ఏర్పాటు చేశారు.

మత్స్య, పశుసంపద మేళా ప్రారంభం 1
1/3

మత్స్య, పశుసంపద మేళా ప్రారంభం

మత్స్య, పశుసంపద మేళా ప్రారంభం 2
2/3

మత్స్య, పశుసంపద మేళా ప్రారంభం

మత్స్య, పశుసంపద మేళా ప్రారంభం 3
3/3

మత్స్య, పశుసంపద మేళా ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement