గజపతి జిల్లా కలెక్టర్‌గా అక్షయ్ సునీల్ అగర్వాల్
పర్లాకిమిడి: గజపతి జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన అక్షయ సునీల్ అగర్వాల్ పర్లాకిమిడి కలెక్టరేట్‌లో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ హాల్‌లో ఉన్నతాధికారులతో సమావేశమై మాట్లాడారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతోపాటు విద్య, ఆరోగ్యం, రవాణా, మంచినీటిని ప్రజలకు సక్రమంగా అందించాలన్నారు. ప్రజా అభియోగాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, ఏడీఎం ఫుల్గునీ మఝి, డీఎఫ్‌వో కె.నాగరాజు, జిల్లా పరిషత్ ఆదనపు ఈవో పృద్వీరాజ్ మండల్ తదితరులు నూతన కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ మహామ్మద్ ముబారక్ ఆలీ, అన్ని మండళాల బీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
గజపతి జిల్లా కలెక్టర్‌గా అక్షయ్ సునీల్ అగర్వాల్


