‘వందేమాతరం’ సంబరం
రాయగడ: జాతీయ గీతం వందేమాతం దేశభక్తి గీతానికి 150 వసంతాలు పూర్తి కావడంతో జిల్లా యంత్రాంగం, ఒడిశా భాషాసంస్కృతి శాఖ సంయుక్తంగా శుక్రవారం పట్టణంలో పలు కార్యక్రమాలను నిర్వహించింది. రాయగడ బీడీవో సుజిత్ కుమార్ మిశ్రో, జిల్లా పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బసంత కుమార్‌ప్రధాన్, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చనా పట్నాయక్, అసిస్టెంట్ గ్రూప్ ఎడ్యూకేషన్ అధికారి విశాల్ సింగ్‌లు ఈ సందర్భంగా మహిళా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతీఒక్కరిలో జాతీయ భావం, దేశభక్తి నిండి ఉండాలని అన్నారు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా రూపొందిన జాతీయ గీతం వందేమాతరం ఆవిర్భవించి 150 వసంతాలు పూర్తికావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అందరిలో సమైఖ్యతా భావం నిండి దేశ ప్రగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాయగడ మున్సిపాలిటీ తదితర ప్రాంతాల్లో వందేమాతం సంబరాలను నిర్వహించారు. పాల్గొన్న విద్యార్థులకు వందేమాతరం గీతం ప్రాముఖ్యత, దాని విశిష్టత గురించి అవగాహన కల్పించారు. అలాగే పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వందేమాతరం గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ నెల 12 వ తేదీన జరగనున్న జాతీయ యువజనోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని పాఠశాలు, కళాశాలల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించనున్నట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది.
‘వందేమాతరం’ సంబరం
‘వందేమాతరం’ సంబరం


