● రోడ్డు భద్రతపై చైతన్యం
రాయగడ: ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ తమ గమ్యానికి సురక్షితంగా చేరుకోవాలని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం చైతన్య ర్యాలీ చేపట్టారు. వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు ర్యాలీలొ పాల్గొన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వల్ల చాలామంది ప్రమాదాలకు తమ నిండుప్రాణాలను బలిగొంటున్నారని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే అంతా చైతన్యవంతులై నియమ నిబంధనలను విధిగా పాటించాలని అన్నారు. స్థానిక సర్క్యూట్ హౌస్ నుంచి ప్రారంభమైన చైతన్య ర్యాలీ పురవీధుల మీదుగా గజపతి కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. ముందుగా కలెక్టర్ కులకర్ణి, ఏడీఎం నవీన్ చంద్ర నాయక్‌లు ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
● రోడ్డు భద్రతపై చైతన్యం


