మహేంద్రగిరిపై చెత్త తొలగింపు
పర్లాకిమిడి: పవిత్ర మహేంద్రగిరి పర్యాటక కేంద్రంలో సెంచూరియన్ వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ప్లాస్టిక్, చెత్త తొలగింపు కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. 22 మంది వాలంటీర్లు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి శివరాం సాబత్, ఎన్‌ఎస్‌ఎస్ పీవో డా.బిష్ణు ప్రసాద్ దాస్, ఫారెస్టు గార్డులు కవితా రాణిదేవి, అటవీ సిబ్బంది చింతామణి శోబోరో, సత్యస్వరాజ్ మహంతి, రంకమణి బరియా, ఎకో డవలప్‌మెంట్ అధ్యక్షుడు సన్యాసీ భుయ్యాన్, ఎంగార్‌సాయి సర్పంచు కుమారి కార్జి తదితరులు పాల్గొన్నారు. కొండపై పర్యావరణ పరిరక్షణకు స్థానికులు పర్యాటకులకు చైతన్యం కల్పించాలని బిష్ణుప్రసాద్ దాస్ అన్నారు. కుంతీ మందిరం, బుర్‌ఖాత్‌పాస్ వరకు చెత్తను తొలగించి విద్యార్థులు శుభ్రం చేశారు.
మహేంద్రగిరిపై చెత్త తొలగింపు


