ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు
అలరించిన పిల్లల వేషధారణలు
రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని జెమ్స్ విద్యాసంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం పిల్లల మధ్య విశేష వేషధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లెటూరి వస్త్రాధారణతో పాటు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ దుస్తుల్లో పిల్లలు సందడి చేశారు. హరిదాసు వేషధారణ ఆకట్టుకుంది. జెమ్స్ విద్యాసంస్థ ప్రాంగణంలో భోగి మంటలను వేసి పిల్లలు ఆనందంగా గడిపారు. ముందుగానే పండగ వాతావరణాన్ని సృష్టించారు. మహిళలు పిండి వంటలను తయారు చేసి ప్రదర్శించారు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతిని తలపించే విధంగా ఆనందంగా అంతా గడిపారు. సంక్రాంతి పండుగ రోజు వరకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని విద్యాసంస్థ ప్రిన్సిపాల్ పతివాడ వనిత, చైర్మన్ తుబాటి రాములు తెలియజేశారు. మహిళల మధ్య సమైఖ్యత భావం ఏర్పడటంతో పాటు పిల్లల్లో మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు
ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు
ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు
ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు


