కాయాకల్ప్ అసెస్‌మెంట్ బృందం పర్యటన
రాయగడ: రాష్ట్ర కాయాకల్ప్ అసెస్‌మెంట్ బృందం శుక్రవారం జిల్లాలొని బిసంకటక్‌లో పర్యటించింది. ఆ బృందంలో రాష్ట్ర ఆరోగ్య శాఖకు చెందిన డాక్టర్ సురహ్‌జీత్ రావు, డాక్టర్ బసంత కుమార్ సాహు, డాక్టర్ ప్రశాంత్ కుమార్ సావత్‌తో కూడిన ఈ బృందం బిసంకటక్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. వివిధ విభాగాల రికార్డులను పరిశీలించింది. అనంతరం ఆరోగ్య కేంద్రంలోని రామయ కేంద్రాన్ని సందర్శించిన బృందం రోగులకు మందులు సకాలంలో అందుతున్నాయా లేదా అనే విషయంపై ఆరా తీశారు. అలాగే ఆరోగ్యకేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉండాలని సూచించింది. అనంతరం ప్రసూతి విభాగాన్ని సందర్శించిన బృందం అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాయాకల్ప్ బృందం పర్యటనలో ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ హరిహర్ బలదేవ్, డాక్టర్ సుమిత్ స్నేహశీస్ నాయక్, డాక్టర్ జీవన్ జ్యోతి ఉన్నారు.
తాబేళ్ల అక్రమ రవాణాకు అడ్డుకట్ట
కొరాపుట్: తాబేళ్ల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. శనివారం నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాం వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో 83 తాబేళ్లు పట్టుబడ్డాయి. డాబుగాం పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టిగుడ గ్రామానికి చెందిన పట్టాడ సర్కార్, రామ్ పల్లాన్ సర్కార్ వీటిని ఒక బైక్ మీద తీసుకొని వెళ్తుండగా దొరికారు. వీటిని కలహండి జిల్లాలో అమ్మకానికి తీసుకొని వెళ్తున్నట్లు పోలీసుల ముందు అంగీకరించారు. డాబుగాం ఫారెస్ట్ అధికారి రాం చంద్ర బోత్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను నబరంగ్‌పూర్ జిల్లా కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. పట్టుబడిన తాబేళ్లని ఇంద్రావతి రిజర్వాయర్ లో విడిచి పెడతామని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు.
నేల బావిలో పడి ఎలుగు బంటి మృతి
కొరాపుట్: నేల బావిలో పడి ఎలుగు బంటి మృతి చెందింది. శనివారం నబరంగ్‌పూర్ జిల్లా నందాహండి సమితి దోహన గ్రామ పంచాయతీ స్కూల్ వెనుక పాడు బడిన బావిలో ఎలుగు కళేబరాన్ని గిరిజనులు గుర్తించారు. ముందు రోజు రాత్రి ప్రహరీ లేని బావిలో ఎలుగు పడిపోయింది. బావి నుంచి బయట పడేందుకు మార్గం లేక పోయింది. రాత్రంతా విపరీతమైన చలి వల్ల ఎలుగు చనిపోయింది. అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని కళేబరం వెలికి తీశారు. పోస్టు మార్టం నిర్వహించి ఖననం చేశారు.
గణతంత్ర వేడుకలపై సమీక్ష
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 26న నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవం ఏర్పాట్లపై అధికారులు శనివారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్ సోమేశ్ కుమార్ ఉపాధ్యాయ్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ వేధ్బర్ ప్రధాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభాత్ ఫెర్రీ విగ్రహలకు నివాళులర్పించడం, ప్రధాన అతిథి చేతరులమీదుగా జాతీయ పతాకావిష్కరణతో పాటు పరేడ్ నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనపై చర్చించారు. అలానే జిల్లా ఆస్పత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా అభివృద్ధిశాఖ అధికారి నరేశ్ చంద్రసభరో, డీఐపీఆర్ ఒ.ప్రమిళ మాఝి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాయాకల్ప్ అసెస్‌మెంట్ బృందం పర్యటన
కాయాకల్ప్ అసెస్‌మెంట్ బృందం పర్యటన
కాయాకల్ప్ అసెస్‌మెంట్ బృందం పర్యటన


