‘పథకాలను వినియోగించుకోవాలి’
పర్లాకిమిడి: ముఖ్యమంత్రి కృషి ఉద్యోగ యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ అన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ప్రాంతీయ స్థాయి వ్యవసాయ యంత్రాల మేళాలో పాల్గొన్నారు. నాల్గో రోజు సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతి రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎం.ప్రకాశ రావు, జిల్లా పరిషత్ అదనపు ఈఓ పృథ్వీరాజ్ మండల్, గుసాని జోన్ 6 జెడ్పీటీసీ ఎస్.బాలరాజు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నామని, వారికి వ్యవసాయ పరికరాలు, యంత్రాల కొనుగోళ్లకు 50 శాతం సబ్సిడీ కోనుగోలు చేసినప్పుడే ఈ ఏడు అందిస్తున్నామని కలెక్టర్ అగర్వాల్ అన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుంటేనే రైతులు అభివృద్ధి చెందుతారని జెడ్పీ అధ్యక్షుడు గవర తిరుపతి రావు అన్నారు. ఖరీఫ్ ధాన్యం అమ్మకాలలో మండీల వద్ద అధికారులు అందజేస్తున్న టోకెన్లలో తక్కువ చేసి ఎందుకు ఇస్తున్నారని తిరుపతి రావు అన్నారు. గుసాని సమితిలో రబీ పంటకు సాగునీరు అందడం లేదు. అందువల్ల మహేంద్రతనయ నది నుంచి సాగునీటిని కాలువల ద్వారా అందించాలని మైనర్ ఇరిగేషన్ అధికారులను కోరారు. ఈ సంధర్బంగా రాయగడ బ్లాక్ బొమ్మిక, కిష్టిపురం రైతులు ఉద్యాన వనాలలో మంచి ఫలితాలు సాధించడంతో వారికి కలెక్టర్ చేతుల మీదుగా వారికి ప్రోత్సాహకాలు అందజేశారు.
‘పథకాలను వినియోగించుకోవాలి’
‘పథకాలను వినియోగించుకోవాలి’


