అన్నదాతల అవస్థలు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మిల్లర్ల సమస్యలతో ఇప్పటివరకూ ధాన్యం కోనుగోలు జరగటం లేదు. డిసెంబరు 30 నుంచి ప్రభుత్వ అధికారులు ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేస్తామని పర్లాకిమిడి ప్రాంతీయ మార్కెట్ కమిటీ (ఆర్.ఎం.సీ.) వద్ద మండీలు అట్టహాసంగా ప్రారంభించినా ఈ రోజు వరకూ ధాన్యం కోనుగోలు జరగలేదు. దీనిపై సబ్ కలెక్టర్, సివిల్ సప్‌లై అధికారి అనుప్ పండాను ఆర్‌ఎంసీ వద్ద ప్రశ్నించగా, ప్రభుత్వానికి, మిల్లర్లకు అగ్రిమెంట్ కుదరకపోవడంతో ఈ నెల 5 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు జరగలేదని, అయితే రాష్ట్ర ప్రభుత్వం, మిల్లర్లకు గురువారం అగ్రిమెంట్ కుదరటంతో జనవరి 8 నుంచి గుసాని, రాయగడ, కాశీనగర్‌లలో 50 కేంద్రాల్లో గురువారం నుంచి ప్రారంభమైనట్టు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అనుప్ పండా తెలియజేశారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 50 వేల క్వింటాళ్ల ధాన్యం కోనుగోళ్లకు లక్ష్యం చేసుకున్నట్టు సబ్ కలెక్టర్, ఇన్‌చార్జి సీఎస్‌ఓ అనుప్ పండా తెలియజేశారు. రైతుల వద్ద ధాన్యం కోనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు వారి అకౌంట్లలో జమ చేస్తారని అన్నారు. మరోవైపు తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి వస్తోంది. కానీ గుసాని, కాశీనగర్ రైతులు ధాన్యం అమ్ముకోలేక విచారం వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాతల అవస్థలు
అన్నదాతల అవస్థలు
అన్నదాతల అవస్థలు


