రైతుల ఆందోళన
కొరాపుట్: ధాన్యం కొనుగోళ్లు చేపట్టక పోవడంతో రైతులు ఆందోళనకి దిగారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా నందాహండి సమితి సిందిగుడ గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు కేంద్రం (మండీ)లో ఆందోళన జరిగింది. ఈ మండిలో ప్రభుత్వం 4 వేల క్వింటళ్ల ధాన్యం కొనుగోళ్లు చేయడానికి లక్ష్యంగా చేసుకుంది. అందుకు సిద్ధంగా రైతులు ధాన్యంతో వారం రోజులుగా ఎదురు చూస్తున్నారు. కొనుగోళ్లు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇది తెలిసి ప్రతిపక్ష బీజేడీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రదాని సంఘటన స్థలానికి చేరుకోని రైతులకు మద్దతు పలికారు.


