ఎస్‌ఎస్‌ఆర్‌పురం విద్యార్థుల ప్రతిభ
ఎచ్చెర్ల : శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ సోషల్ స్టడీస్ టీచర్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోషల్ స్టడీస్ ఫెస్టివల్–2026 జిల్లా స్థాయి పోటీల్లో సంతసీతారాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వీరు ప్రదర్శించిన స్టార్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి లభించింది. అధునాతన సాంకేతిక విధానాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించేలా వ్యవసాయం చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశమని విద్యార్థులు పేర్కొన్నారు. సోషల్ ఉపాధ్యాయురాలు పి.జగదాంబ సహాయంతో ఈ ప్రాజెక్టు తయారుచేశారు. వీరిని హెచ్‌ఎం టి.జయలక్ష్మీ, ఉపాధ్యాయులు అభినందించారు.


