జ్ఞానం మానవాళి సేవకు ఉపయోగపడాలి: గవర్నర్
భువనేశ్వర్: గ్రాడ్యుయేషన్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, సామాజిక సామరస్యంతో మానవాళికి సేవకు దోహదపడే పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి జ్ఞానాన్ని ఉపయోగించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి కోరారు. గంజాం జిల్లా బరంపురం నిస్ట్ విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గ్రాడ్యుయేట్లు శ్రేష్టత, సమగ్రతకు రాయబారులుగా సముపార్జించిన విద్యతో అనుసంధానించబడి ఉండాలని, సమాజానికి అర్థవంతంగా సహకరించాలని ఆయన కోరారు. గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి డాక్టర్ కంభంపాటి మాట్లాడుతూ సుస్థిరత, ప్రజారోగ్యం, సైబర్ భద్రత నుంచి సమతుల్య వృద్ధి వరకు ప్రస్తుత యుగం ఎదుర్కొంటున్న సవాళ్లను కరుణాత్మక సామర్థ్యం మేళవింపు నైపుణ్యత రంగరించుకోవాలని ఆకాంక్షించారు. నిజమైన నాయకత్వం వ్యక్తిగత సాధన ద్వారా మాత్రమే కాకుండా సమాజంలో ఎవరికి వారుగా సృష్టించే సానుకూల, శాశ్వత ప్రభావం ద్వారా నిర్వచిస్తారని తెలిపారు. విజయాన్ని డిగ్రీల ద్వారా మాత్రమే కాకుండా విమర్శనాత్మక ఆలోచన, నైతిక వ్యవహారం, నిరంతర సామర్థ్యం ప్రామాణికలుగా నిలుస్తాయన్నారు. విద్య జీవిత కాలపు అభ్యాసం అంకురార్పణగా పరిగణించాలని విద్యార్థులకు గవర్నర్ ప్రబోధించారు. అధ్యక్షుడు డాక్టర్ సుకాంత్ కుమార్ మహా పాత్రో నేతృత్వంలో జాతీయ విద్యా విధానం 2020తో నిస్ట్ విశ్వవిద్యాలయం యొక్క సమన్వయాన్ని గవర్నర్ ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రసంగించిన ఇతర ప్రముఖుల్లో న్యూఢిల్లీ ఏఐసీటీఈ వైస్ చైర్మన్ అభయ్ జెరె, నిస్ట్ విశ్వ విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ సుకాంత్ కుమార్ మహా పాత్రో, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ప్రియదర్శన్ పాత్రో ఉన్నారు.


