జగన్నాథునికి 37 గ్రాముల బంగారు పాపిడి బిళ్ల వితరణ
కొరాపుట్: శబరి శ్రీ క్షేత్ర జగన్నాథునికి 37 గ్రాముల బంగారు పాపిడి బిళ్లని భక్తుడు వితరణగా ఇచ్చారు. గురువారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని శబరి శ్రీ క్షేత్ర కార్యదర్శి భవానీ ఆచార్య ప్రకటించారు. బ్రహ్మపురకు చెందిన జగన్నాథ భక్తుడు సిమ్మాంచల్ మహాపాత్రో రు.50 లక్షల వ్యయం గల ఈ ఆభరణం విరాళంగా క్షేత్రానికి అందించారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
జయపురం: స్థానిక జగన్నాథ మందిరంలో అవిభక్త కొరాపుట్ జిల్లా బ్రాహ్మణ సమాజ్ సభ్యులు 2026 సంవత్సరం క్యాలెండర్‌ను గురువారం ఆవిష్కరించారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సమాజ్ సభ్యులు రమేష్ చంద్ర త్రిపాఠీ, శరత్ చంద్ర ఖడగరాయ్, నవకృష్ణ రథ్, బుణు, స్వాధీన సాహు, బాలాజీ సాహు, బిజయ కుమార్ భట్, రాజకిశోర్ దాస్, భవానీ ఆచార్య, అమరేంద్ర ఖర్, మను, సన చౌదరి, తేజస్వి చౌదరి, గోవింద సాహు మొదలగు తదితరులు పాల్గొన్నారు.
జయపురంలో
ఫిల్మ్ ఫెస్టివల్
జయపురం: పట్టణంలో జనవరిలో జరగనున్న పుష్‌పుణి మహోత్సవాల్లో భాగంగా స్థానిక కరసుధా సినిమా థియేటర్‌లో పుషిపుణి ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం నిర్వహించారు. దీనిలో భాగంగా తక్కువ నిడివి కలిగిన 9 చిత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రముఖ నాట్యకారుడు గోవింద చంద్ర సాహు, అవిభక్త కొరాపుట్‌లో మొదటిగా సినిమా ప్రొడక్షన్ చేసిన కళాకారుడు సుకాంత అధికారి, గౌరవ అతిథిగా కొరాపుటియ ఫిల్మ్ డవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు రవీంద్ర పాత్రో, కార్యదర్శి అమర మిశ్ర, కళాకారుడు రబి పాత్రో, సంగీత కళాకారుడు జి.మహేష్, కొరాపుటియ కళా, కళాకార సంస్థ అధ్యక్షుడు మనోజ్ పాత్రో, కార్యదర్శి ధీరేన్ మోహన్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
జగన్నాథునికి 37 గ్రాముల బంగారు పాపిడి బిళ్ల వితరణ
జగన్నాథునికి 37 గ్రాముల బంగారు పాపిడి బిళ్ల వితరణ


