ఘనంగా క్రిస్మస్ వేడుకలు
కొరాపుట్: క్రిస్మస్ వేడుకలు గురువారం కొరాపుట్,నబరంగ్‌పూర్ జిల్లాల్లో ఘనంగా జరిగాయి. శతాబ్దం పైగా చరిత్ర ఉన్న జయపూర్ యువలాంజికల్ లూధరన్ చర్చి (జేఈఎల్‌సీ) నేతృత్వంలో పలు చర్చిల్లో ప్రార్థనలు జరిగాయి. నబరంగ్‌పూర్ మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, జెడ్పీ సభ్యుడు అరుణ్ మిశ్రలు తెంతులకుంటి చర్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని జేయిఎల్‌సీ ప్రాంగణంలో డీసీసీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి పాల్గొన్నారు. బీజేడీ కౌన్సిలర్ నాగేంద్ర పట్నయక్‌తో కలసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడి: క్రీస్తు జననం, క్రిస్మస్ పండగ సందర్భంగా పట్టణంలో కాలేజ్ రోడ్డులో ఉన్న పురుషోత్తం బాప్టిస్టు చర్చిలో పాస్టర్ ప్రమోద్ కుమార్ నాయక్, డాక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం సువార్తను, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే డోలా ట్యాంకు రోడ్డులో ఉన్న రోమన్ కాథలిక్ చర్చిలో ఫాదర్ అజిత్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు, సువార్తను వినిపించారు. జిల్లాలో గుమ్మ, కాశీనగర్, ఆర్. ఉదయగిరి, మోహానా, రామగిరి, బడపద చర్చిల్లో క్రిష్టియన్ సోదరులకు సువార్తను అందించారు.
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ఘనంగా క్రిస్మస్ వేడుకలు


