విమానయోగం | - | Sakshi
Sakshi News home page

విమానయోగం

Aug 27 2025 9:59 AM | Updated on Aug 27 2025 9:59 AM

విమాన

విమానయోగం

ఒడిశాకు భారీ విమానయాన ప్రోత్సాహం

పూరీలో అంతర్జాతీయ విమానాశ్రయం

పౌర విమానయాన మంత్రుల

సమావేశంలో సీఎం వెల్లడి

అందరికీ

విమానయానం: మంత్రి

భువనేశ్వర్‌ : ఒడిశాకు విమానయోగం కలిగింది. పూరీలో అంతర్జాతీయ విమానాశ్రయం, రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఎంఆర్‌ఓ సౌకర్యం, గిరిజన బాలికలకు పైలట్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. నగరంలో జరిగిన పౌర విమానయాన మంత్రుల సమావేశంలో కేంద్ర పౌర విమానయాన విభాగం మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు సమక్షంలో ముఖ్యమంత్రి రాష్ట్రానికి పలు వరాలు కురిపించారు.

పూరీ అంతర్జాతీయ విమానాశ్రయం..

పూరీ పవిత్ర పుణ్యక్షేత్రంలో జగన్నాథ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఖరారైంది. ఈ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న లక్షలాది మంది జగన్నాథ భక్తులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక ప్రధాన ద్వారంగా ఉపయోగపడుతుంది. పూరీలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ఈ కార్యక్రమంలో ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న పర్యావరణ, అటవీ అనుమతులు త్వరలో ఆమోదం పొందే అవకాశం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పు ప్రాంత పౌర విమానయాన మంత్రుల సమావేశంలో భువనేశ్వర్‌ నుంచి దుబాయ్‌, సింగపూర్‌లకు ప్రత్యక్ష విమాన సేవల పునరుద్ధరణ నేపథ్యంలో శీతాకాలపు షెడ్యూల్‌లో వాటిని కొనసాగించడానికి ఇండిగోతో చర్చలు జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి పేర్కొన్నారు. తూర్పు ప్రాంత పౌర విమానయాన మంత్రుల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి ప్రధాన బి–మాన్‌ కార్యక్రమం కింద ఒడిశా విమానయాన రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రధాన కార్యక్రమాలను ఆవిష్కరించారు.

– విమానయానంలో సాధికారత సాధన కోసం రాష్ట్రం నుంచి గిరిజన బాలికలను విమాన పైలట్లుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

– స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచ స్థాయి నిర్వహణ, మరమ్మత్తు మరియు ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ) కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఎయిర్‌ వర్‌ుక్సతో ఒప్పందం కుదిరింది. ఈ సౌకర్యం స్థానిక యువతకు శిక్షణ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఆవిష్కరిస్తుంది.

– గత 14 నెలల్లో ఒడిశా విమానాశ్రయాలు 15 కొత్త గమ్యస్థానాలకు అనుసంధానించబడ్డాయి. ఈ అనుసంధానం జాతీయ, అంతర్జాతీయ విమానయాన పరిధిని విస్తరించనుంది. పూరీ, రౌర్కెలా, పారాదీప్‌లో విమానాశ్రయాల అభివృద్ధి, ఉడాన్‌ పథకం పొడిగించారు.

– ఢెంకనాల్‌ జిల్లా బిరషా ప్రాంతంలో ప్రపంచ స్థాయి విమానయాన శిక్షణా కేంద్రం రాబోతోంది. ఈ కేంద్రం ఏర్పాటుతో రాష్ట్రంలో విమాన శిక్షణ, యూఏవీ శిక్షణ, ఎయిర్‌ స్పోర్ట్సు సౌకర్యాలు ఏర్పాటుకానున్నాయి.

– ఝార్సుగుడలో పెరుగుతున్న ప్రయాణికులు, కార్గో ట్రాఫిక్‌ను నిర్వహించడానికి విమానాశ్రయ విస్తరణ కోసం భూసేకరణ పూర్తయింది.

– విమానాయన అనుసంధానం లేని జిల్లాల్లో 14 కొత్త విమానాశ్రయాలు, 15 హెలిపోర్ట్‌ల అభివృద్ధి చేపడతారు. నిరుపయోగంగా పడి ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను క్రియాత్మక విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తారు.

విమానయోగం1
1/2

విమానయోగం

విమానయోగం2
2/2

విమానయోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement