
సుపరిపాలనే లక్ష్యం
భువనేశ్వర్: సామాన్య ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించి సుపరిపాలన సాగించే దిశగా పనిచేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం అమ్మొ శాసన్ వ్యవస్థని ప్రవేశ పెట్టినట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అన్నారు. స్థానిక లోక్ సేవా భవన్‌లో అమ్మొ శాసన్ వ్యవస్థను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా పాలన సాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ వ్యవస్థ, ప్రజల మధ్య మంచి సంబంధాన్ని ఏర్పరచడం, ఉన్నత ప్రజా సేవలను సకాలంలో కల్పించడం, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా అమ్మొ శాసన్ కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిందన్నారు. ప్రజలు వాట్సాప్ చాట్ (+91–7400221903), వెబ్‌సైట్ చాట్‌బాట్, టోల్–ఫ్రీ నంబర్ 14471 ద్వారా సాధారణ ప్రజలు వివిధ ప్రభుత్వ సేవలపై తమ అభిప్రాయాలను నేరుగా తెలియజేయవచ్చన్నారు.