
ఉద్యోగుల సమ్మె విరమణ
పర్లాకిమిడి: రాష్ట్ర వ్యాప్తంగా ఒడిషా రాష్ట్ర రెవెన్యూ మినీస్టీరియల్ ఉద్యోగులు 15 రోజులుగా కలెక్టరేట్‌ల వద్ద జరుపుతున్న సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విరమించినట్టు జిల్లా రెవెన్యూ అమలా సంఘం కార్యదర్శి సంతును పాఢి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల సంఘాలకు తీవ్ర హెచ్చరికలు చేసిన నేపథ్యంలో 15 రోజుల పాటు జరిపిన మాస్ లీవ్‌ను రద్దు చేశారు. వారి ప్రధాన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆదేశాలు ఇవ్వడంతో మంగళవారం రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన విరమించారు.
చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
రాయగడ: చొరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్టు కాసీపూర్ పోలీసులు మంగళవారం తెలిపారు. అరెస్టయిన వారిలో సిరిపాయి పంచాయతీ పరిధి అంబాబలేరి గ్రామానికి చెందిన అమీష్ మాఝి, గజేంద్ర గౌడోలు ఉన్నారన్నారు. వారివద్ద నుంచి ఒక బంగారు గొలుసు, 9,800 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించామన్నామన్నారు. ఈ నెల 21వ తేదీన అంబాబలేరి గ్రామంలో నివసిస్తున్న నాథొ గౌడో ఇంట్లో చోరీ. ఈ మేరకు బాధితుడు కాసీపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
రూ. 1.75 లక్షల చోరీ
రాయగడ: బ్యాగులో ఉన్న 1.75 లక్షల రూపాయల నగదును గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన స్థానిక కపిలాస్ కూడలిలో చోటు చేసుకుంది. కొలనార సమితి ముకుందపూర్ గ్రామానికి చెందిన ఎస్.సాహు ఈ మేరకు సదరు పోలీస్ స్టేషన్‌లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. సొమవారం మధ్యాహ్నం స్థానిక ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి తన ఖాతాలో 1.75 లక్షల రూపాయల నగదును విత్ డ్రా చేసిన తరువాతలో బ్యాగులో ఉంచి బైకుపై వెళుతున్నాడు. ఈ క్రమంలో స్థానిక కపిలాస్ కూడలిలోని ఓ దుకాణంలో బైకును నిలిపి లోపలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి బైకుకు ఉన్న బ్యాగ్ చోరీకి గురైంది. సీసీ కెమెరాల ఫుటేజ్ అనంతరం స్థానిక పోలీసులు దుండగులను గుర్తించే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుక లారీలు స్వాధీనం
రాయగడ: ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా గుణుపూర్ సబ్ డివిజన్ పరిధిలోని వంశధార నది నుంచి ఇసుకను లారీల్లొ తరలిస్తున్నారన్న సమాచారం మేరకు గుమడ పోలీసులు ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో ఇసుకతో ఉన్న రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజులుగా వంశధార నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులను నిర్వహించిన పోలీసులు సామవారం రాత్రి నది తీర ప్రాంతంలో ఉన్న రెండు హైవా లారీను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వోఎంసీ అధికారులకు సమాచారం అందించారు.

ఉద్యోగుల సమ్మె విరమణ

ఉద్యోగుల సమ్మె విరమణ