
జగన్నాథ పాలక మండలి సభ్యునిగా గిరీష్ చంద్ర
భువనేశ్వర్ : భారత మాజీ కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (కాగ్) డాక్టర్ గిరీష్ చంద్ర ముర్ము పూరీ జగన్నాథ ఆలయ పాలక మండలి సభ్యునిగా నియమితులయ్యారు. ఈయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రఽముఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. పలు ప్రభుత్వ శాఖల్లో కీలక అధికారిగా పనిచేశారు. డాక్టర్ గిరీష్ చంద్ర ముర్ముతో పాటు 10 మంది సభ్యులతో కూడిన శ్రీ మందిరం పాలక మండలి ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎ.కె.సాబత్, మహేష్ కుమార్ సాహు, డాక్టరు సిద్ధేశ్వర మహాపాత్రో(ముక్తి మండపం ప్రతినిధి), రఘుబీర్ దాస్ మహారాజ్, బలారమ్‌కోట్ మఠం అధిపతి (మఠాల వర్గీయ ప్రతినిధి), కృష్ణ చంద్ర సామంత్రాయ్, మధుసూదన్ సింగారి, జగన్నాథ్ పూజాపండా, గణేష్ దాస్ మహాపాత్రో, రామనారాయణ గొచ్ఛికర్(సేవాయత్ ప్రతినిథులు) సభ్యులుగా ఉన్నారు.
పాలనలో పారదర్శకత
మల్కన్‌గిరి: పాలనలో పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మన శాసనం అనే కొత్త వ్యవస్థను మంగళవారం ప్రారంభించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో వృత్తిపరమైన ధోరణి, ప్రవర్తనలో మార్పు తీసుకురావడం ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. లోకసేన భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మన వ్యవస్థ పోర్టల్‌ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ప్రారంభించారు. ఇకపై జిల్లాలో 8 విభాగాల్లో ప్రజలు తమ సమస్యలను 91–7400221903 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్‌లు సోమానాథ్ ప్రధాన్, వేద్బ్‌ర్ ప్రధాన్, డీఐపీఆర్ ప్రమిళా మాఝి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

జగన్నాథ పాలక మండలి సభ్యునిగా గిరీష్ చంద్ర