
వక్తృత్వ పోటీలకు విశేష స్పందన
జయపురం: ఈ నెల 31వ తేదీన జరుగనున్న స్వయం పాలన దినోత్సవం సందర్భంగా జయపురం మున్సిపాలిటీలో గల వివిధ పాఠశాలల విద్యార్థులకు వివిధ పోటీలను మంగళవారం నిర్వహించారు. స్థానిక నెహ్రునగర్‌లో గల తెలుగు సాంస్కృతిక సమితి వారు జయపురం సిటీ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. సీనియర్స్ విద్యార్థుల మధ్య జరిగిన వక్తృత్వ పోటీల్లో అరవింద నగర్ శిశుమందిర విద్యార్థి రుచి పాల్ ప్రథమ స్థానం, శారదా శిశుమందిర విద్యార్థి తితిక్ష మిశ్ర, విజ్ఞాన విద్యాలయం విద్యార్థి రితిజ రియశ్రీ సుబుద్ధి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వక్తృత్వ జూనియర్ విద్యార్థుల్లో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థి సుమిత్ర పండా, శారదా విహార్ సరస్వతీ శిశుమందిర్ విద్యార్థి ప్రతిక్ష ప్రధాన్, మోడరన్ ఇంగ్లీష్ పాఠశాల విద్యార్థి ప్రియంశీ పండా వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. చిత్రలేఖన పోటీల్లో కేంద్ర విద్యాలయం విద్యార్థి శ్వీకృతి త్రిపాఠీ ప్రథమ, ఎక్స్ బోర్డు మహమ్మద్ పాఠశాల విద్యార్థి ఫౌజియ ఫాతిమ ద్వితీయ, సునారి వీధి ప్రాథమిక పాఠశాల విద్యార్థి పి.యషిత, సిటీ ఇంగ్లీష్ పాఠశాల విద్యార్థి అభశ్రీ పట్నాయక్ తృతీయ స్థానాల్లో నిలిచారు. సిటీ ఆంగ్ల పాఠశాల విద్యార్థి దేవాంశు పట్నాయక్, పబ్లిక్ స్కూల్ విద్యార్థి అక్షయ రథ్‌లు ప్రత్యేక బహమతులకు ఎంపికయ్యారు. క్విజ్ పోటీల్లో విక్రమదేవ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు కృష్ట సాగరియ, అరుణ మిశ్ర ప్రథమ, ద్వితీయ, మోడరన్ ఇంగ్లీషు పాఠశాల విద్యార్థి స్వాభిమాన్ స్వైయిన్ తృతీయ స్థానంలో నిలిచారు. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, వైస్ చైర్‌పర్సన్ బి.సునీత పర్యవేక్షించారు.

వక్తృత్వ పోటీలకు విశేష స్పందన