
ఎరువుల కోసం రైతుల ఆందోళన
ల్యాంప్స్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు
మల్కనగిరి: జిల్లాలోని మథిలి సమితిలో ఎరువుల కొరత తీవ్రంగా ఉండడంతో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ల్యాంప్స్ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. సమితిలో సుమారు పదివేల ప్యాకెట్లు అవసరముండగా ఇప్పటికి కేవలం 4,600 ప్యాకెట్లు మాత్రమే వచ్చాయని ల్యాంప్స్ వర్గాలు తెలియజేశాయి. వరి సాగులో ఎరువుల అవసరం కారణంగా సకాలంలో లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎరువుల కోసం రైతుల కాళ్లు అరిగేలా ల్యాంప్స్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేక వెనుదిరిగిన సంఘటనలు చోటు చేసుకోవడంతో ఆగ్రవ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను నిలిపివేశారు. మల్కనగరి– జయపూర్ రహదారి వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న బీడీఓ ప్రమెదు కుమార్ బెహర, తహసీల్దార్ మానసీ భొయ్, తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

ఎరువుల కోసం రైతుల ఆందోళన

ఎరువుల కోసం రైతుల ఆందోళన

ఎరువుల కోసం రైతుల ఆందోళన