
ప్రయాణికుని బ్యాగు అప్పగింత
రాయగడ: మునిగుడ ఆర్పీఎఫ్ అధికారి ఎన్.ఎస్.మీన, ఎస్‌ఐ సి.హెచ్.బి.రావు ఒక ప్రయాణికుని బ్యాగును తిరిగి అతనికి అప్పగించారు. గురువారం టాటానగర్ ఎక్స్‌ప్రెస్ బి–4 బోగీలొ ప్రయాణిస్తున్న కె.లోకేష్ బ్రహ్మ అనే ప్రయాణికుడు కేరళా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖ జిల్లా దువ్వాడ వరకు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో దువ్వాడ రైల్వే స్టేష్ వచ్చేసరికి హడావిడిగా దిగిపోయారు. ట్రాలీ బ్యాగ్‌ను మరిచిపోయారు. దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం స్పందించిన రైల్వే పోలీసులు మునిగుడ ఆర్పీఎఫ్ వారికి సమాచారం అందించారు. మునిగుడకు ఎక్స్‌ప్రెస్ చేరుకునే సరికి బి–4 బోగిలో వెతికి ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బ్యాగును ప్రయాణికునికి పిలిచి అప్పగించారు.