
బ్యాడ్మింటన్ పోటీల విజేతగా విజయనగరం
అరసవల్లి: జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా జరుగుతున్న విద్యుత్ శాఖ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు శనివారంతో ముగిశాయి. తుది ఫలితాల్లో ఓవరాల్ చాంప్‌గా విజయనగరం సర్కిల్ ఈపీడీసీఎల్ జట్టు నిలిచింది. రెండో స్థానంలో నెల్లూరు ఎస్‌పీడీసీఎల్, మూడో స్థానంలో జెన్‌కో ఆర్టీపీఎస్ కృష్ణపట్నం నిలిచాయి. శనివారం శ్రీకాకుళం విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన బహుమతుల ప్రదాన కార్యక్రమంలో తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ డి.చంద్రం, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టి.వనజ, చీఫ్ జనరల్ మేనేజర్ (ఆర్‌ఎ) ఎల్.మహేంద్రనాథ్, సీజీఎం (మెటీరియల్స్) పి.శ్రీదేవి, జనరల్ మేనేజర్ కె.సురేఖ తదతరులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రం మాట్లాడుతూ తొలిసారి రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ వడివేలు, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, సర్కిల్ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, జనరల్ సెక్రటరీ, డివిజనల్ ఈఈ పైడి యోగేశ్వరరావు, సెక్రటరీ మహంతి ప్రభాకరరావు, సనపల వెంకటరావు, డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, ఎస్‌ఏఓ ఎ.శ్రీనివాసరావు, డీ–1 ఏఈ జె.సురేష్‌కుమార్, డీ–2 ఏఈ కింజరాపు జయరాం తదితరులు పాల్గొన్నారు.