
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.1,01,116 నగదును విశాఖపట్నానికి చెందిన కొల్లి తిరునాథరెడ్డి, ఝాన్సీరాణి దంపతులు శనివారం సమర్పించారు. తన తల్లి సత్యవతి జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు దాతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, సూపరింటెండెంట్ వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు.
సముద్రపు నాచు పెంపకంపై అవగాహన
సోంపేట: సముద్రపు నాచు పెంపకంపై మహిళలు అవగాహన పెంచుకుని అదనపు ఆదాయాన్ని పొందాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోంపేట మండలం గొల్లూరు పంచాయతీ మూల పొలం గ్రామంలో జాతీయ మత్స్య అబివృద్ధి బోర్డు, ఉదయ్ ఆక్వా ఆధ్వర్యంలో సాగు చేస్తున్న సముద్రపు నాచు పెంపకం చెరువులను కల్టెక్టర్ శనివారం పరిశీలించారు. అనంతరం స్థానిక మత్స్యకార మహిళలతో సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా మాట్లాడారు. నాచు పెంపకం వల్ల కలిగే ఆదాయంపై ఆరా తీశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యత
కొత్తూరు: జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నట్లు జిల్లా ఉద్యానవన అధికారి వరప్రసాదరావు తెలిపారు. కొత్తూరు మండలం ఇరపాడులో గొర్లె గౌరినాయుడుకు చెందిన ప్యాక్ హౌస్‌ను ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ శ్రీనివాసరావులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యాక్ హౌస్‌లకు ప్రభుత్వం రూ.రెండు లక్షలు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది 18 హౌస్‌లు నిర్మించిచగా, ఈ ఏడాది 22 నిర్మించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల ఉద్యానవన అధికారి బి.అయింతి పాల్గొన్నారు.
డీఈఓను తక్షణమే నియమించాలి
శ్రీకాకుళం: జిల్లా విద్యాశాఖ అధికారిని తక్షణమే నియమించాలని డీటీఎఫ్ నాయకులు పూజారి హరిప్రసన్న, పేడాడ కృష్ణారావు శనివారం డిమాండ్ చేశారు. 25 రోజులుగా రెగ్యులర్ డీఈఓను గానీ, పూర్తి అదనపు బాధ్యతలతో డీఈఓను నియమించకపోవడం విచారకరమన్నారు. విద్యా వ్యవస్థ కుంటుపడుతోందని ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోవడంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆగస్టులో ఇంక్రిమెంట్లకు సంబంధించిన ౖఫైల్పె సంతకాలు లేకపోవడంతో పాత జీతంతోనే బిల్లులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. వీసాలు, పాస్‌పోర్టులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం కొందరు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారని, అవి కూడా పెండింగ్‌లో ఉండిపోయాయని తెలిపారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి
బహిరంగ క్షమాపణ చెప్పాలి
శ్రీకాకుళం అర్బన్: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని జిల్లా ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేశారు. శనివారం శ్రీకాకుళంలోని సరస్వతీ థియేటర్ ఆవరణలో జిల్లా ఎన్టీఆర్ అభిమానులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్, శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు దుంగ శ్రీధర్, శ్రీకాకుళం నగర ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు బుర్రి మధు మాట్లాడుతూ నందమూరి కుటుంబ సభ్యురాలైన నందమూరి షాలిని, జూనియర్ ఎన్టీఆర్‌లను దుర్భాషలాడినందుకు ఎమ్మెల్యేను తక్షణమే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొన్నారు.

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం