
ఉపాధ్యాయుడు అరెస్ట్
పర్లాకిమిడి: మావోయిస్టులతో సంబంధం కలిగివున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని బుధవారం అడవ పోలీసులు అరెస్టు చేశారు. గజపతి జిల్లా మోహానా నియోజకవర్గం అడవ పి.ఎస్ పరిధిలో నువా ఖోజురిపద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత కొద్ది నెలలుగా ఎక్స్‌క్యాడర్ టీచర్‌గా ప్రతాప్ కుమార్ నాయక్ పనిచేస్తున్నారు. 2011లో అడవలో అంధేరీ ఘాట్ మావోయిస్టుల బ్లాస్టింగ్, 2013లో మోహనా పి.ఎస్.పరిధిలో భలియాగుడలో జరిగిన మావోల హింసాకాండలో ప్రతాప్ నాయక్ ఉన్నట్టు అడవ పోలీసులు వెల్లడించారు. ఆయనపై అడవ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. ఆర్.ఉదయగిరి పోలీసు ష్టేషన్‌లో మరికొన్ని కేసులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా తెలియజేశారు. ఉపాధ్యాయుడు ప్రతాప్ గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నట్టు ఎస్పీ తెలియజేశారు. ఈ రెండు కేసులు ఆధారంగా ప్రతాప్ కుమార్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేశారు. అడవ, మోహానా, ఆర్.ఉదయగిరిలలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మరి కొంతమంది ఉపాధ్యాయులు నక్సల్, గంజాయి రవాణా కేసుల్లో ఉన్నారని, వారు ఆయా పోలీసు ష్టేషన్లలో స్వచ్ఛందంగా లోంగిపోవాలని, లేకుంటే వారిని ఎక్కడున్నా పట్టుకుని అరెస్ చేస్తామన్నారు.