
సంబల్‌పూర్ పట్టణంలో..రాత్రీపగలూ నీటి సరఫరా
భువనేశ్వర్: పశ్చిమ ఒడిశా సంబల్‌పూర్ పట్టణానికి రాత్రీపగలూ నిరవధికంగా తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన బుధవారం లోక్ సేవా భవన్ సమావేశం హాల్‌లో 24వ మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 6 శాఖల నుంచి 7 ప్రధాన ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించింది. ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి, సహకార, ఆర్థిక, వాణిజ్యం– రవాణా, ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖలు ఒక్కో ప్రతిపాదన, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ 2 ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదానికి ప్రతిపాదించాయి. సమగ్రంగా ఈ 7 ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. సంబల్‌పూర్ పట్టణంలో రూ.382.40 కోట్ల వ్యయ ప్రణాళికతో రాత్రీపగలూ తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు మంత్రి మండలి ఆమోదించింది. ఈ ఆమోదం ప్రకారం ఈగిల్ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్ 2043 నాటికి ప్రాథమిక అంచనా ప్రకారం రూ.7 లక్షల మందికి ఆమోదిత తాగునీటి సరఫరా సేవలందించేదుకు ఇన్‌టేక్ బావులు, నీటి శుద్ధి కర్మాగారం, టర్బైన్ పంపులను నిర్మిస్తుంది. రూ. 300 కోట్ల రాష్ట్ర వ్యయ ప్రణాళికతో తొలి విడతలో 14 భారీ, 17 మధ్య, 7 చిన్న తరహా మండీల ఏర్పాటుకు మంత్రి మండలి మార్గం సుగమం చేసింది. ఈ మండీల్లో అధునాతన నిల్వ, పంటకోతలో డిజిటల్ వ్యవస్థ, పంటలకు సరసమైన ధరల నిర్ధారణ, వరి సేకరణలో పారదర్శకత, పంటల తర్వాత నష్టాల నియంత్రణకు అనుబంధ సౌకర్యాలతో సమగ్రంగా 38 ఆదర్శ మండీలను ఏర్పాటు చేయడానికి మంత్రి వర్గం అంగీకరించింది. 110 పట్టణ స్థానిక సంస్థలలో విద్యుచ్ఛక్తి వినియోగం తగ్గించే దృక్పథంతో రెట్రోఫిట్టింగ్ స్ట్రెచ్‌లలో ఎల్‌ఈడీ పబ్లిక్ స్ట్రీట్ లైటింగ్ కోసం నిధులు మంజూరు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మాన్ పథకం కింద భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచ శ్రేణి ఎంఆర్‌ఓ (నిర్వహణ, మర్మతు, ఓవర్‌హాల్) సౌకర్యం కల్పించేందుకు ఎయిర్ వర్‌ుక్స ఇండియా సంస్థకు ఐపీఆర్ 2022 కింద ప్రోత్సాహకాలను విస్తరించారు. ఈ ప్రాజెక్ట్ కింద ఒడిశాను ప్రాంతీయ విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేసి 2031 నాటికి అంచనా ప్రకారం 117 అమెరిన్ బిలియన్ల డాలర్లు సామర్ధ్యంతో ప్రపంచ ఎంఆర్‌ఓ మార్కెట్‌లో రాష్ట్రం ఉనికిని బలపరచుకుంటుంది. ప్రభుత్వ సంస్థలలో నర్సింగ్ అధ్యాపక నియామకం మరియు పదోన్నతి విధానాల కోసం మంత్రి మండలి ప్రతిపాదిత ఒడిశా నర్సింగ్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్, 2025ను ఆమోదించింది. ఈ తీర్మానంతో ప్రస్తుతం పని చేస్తున్న 8 నర్సింగ్ కళాశాలలు, 21 ఏఎన్‌ఎం శిక్షణా కేంద్రాలు, 7 కొత్తగా ఏర్పాటు కానున్న కళాశాలల్లో ఖాళీల భర్తీని పరిష్కరిస్తుంది. ఆయా సంస్థల్లో నాణ్యమైన బోధనను నిర్ధారించి నర్సింగ్ విద్యను బలోపేతం చేస్తుంది. సాంస్కృతిక నిర్వహణ, సమన్వయంతో రాష్ట్ర మ్యూజియం పనితీరును మెరుగుదల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు, సీటీ, జీఎస్‌టీ కార్యాలయాలలో ఒడిశా మినిస్టీరియల్ సేవల నియమాల ప్రతిపాదనలు మంత్రి మండలి ఆమోదం పొందాయి.
రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం